జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం
నిర్వహణ పద్ధతులు గుర్తింపు
నెల్లూరు :పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో ఈ నెల 26వ తేది వరకు వేస్ట్ మేనేజ్మెంట్ , రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెంట్ ఆద్వర్యంలో నిర్వహించనున్న మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, సమావేశాల చట్టం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యత-శిక్షణ కార్యక్రమానికి నగర మేయర్ పి.స్రవంతి జయవర్థన్ హాజరైయ్యారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అవలంబిస్తున్న చెత్త సేకరణ ,నిర్వహణ పద్దతులను గుర్తించామన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగమైన సెగ్రెగేషన్, హౌం కంపోస్టింగ్ లాంటి ఎన్నో విధానాల గురించి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ డా.స్నేహ పల్నికర్, కో-ఆర్డినేటర్ బి.వి. వాకురే తదితరులు పాల్గొన్నారు.










