Apr 08,2023 20:01

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

రైల్వేకోడూరు : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి అధికారం చేపట్టినప్పటి నుంచి సంక్షేమం,అభివద్ధి దిశలో పయనిస్తుందని అన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సాకారంతో దేశంలోని వంద ప్రముఖ దిగ్గజ కంపెనీలతో రాజంపేటలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజంపేట, కోడూరు నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఏర్పాటు చేశామని, పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ప్రజారెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ సుకుమార్‌ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.డి.నాగేంద్ర యాదవ్‌, మండల కన్వీనర్‌ సుధాకర్‌ రాజు, టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సాయి కిషోర్‌ రెడ్డి, టి రాజేంద్ర, సర్పంచులు రామకష్ణ, సుబ్రహ్మణ్యం రాజు, హరికష్ణ రెడ్డి, ఈశ్వరయ్య, రమణారెడ్డి, రవూఫ్‌, సిహెచ్‌ రమేష్‌, నాగేంద్ర పాల్గొన్నారు.