జిల్లా పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వామపక్షాలు, అఖిలపక్షం, దళిత సంఘాలు శనివారం పట్టణంలోని ఎర్రముక్కపల్లెలోని ఓ లాడ్జి దగ్గర నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా చేప్టిన శాంతియుత ర్యాలీని హౌస్ అరెస్టులు, నిర్బంధాలు, అరెస్టులతో అడ్డుకుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను లాడ్జి దగ్గర పోలీసులు అరెస్టు చేయడం, మిగిలిన వామపక్ష, అఖిలపక్ష, దళిత సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బందించడం వంటి ఘటనలతో శాంతియుత ర్యాలీలను అడ్డుకున్నారు. ప్రజాశక్తి - కడప ప్రతినిధి/కడప అర్బన్
జిల్లాలో రాజ్యాంగ బద్దమైన నిరసన హక్కు ఉల్లంఘనకు గురవుతోంది. ప్రభుత్వం అంబే ద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమ ర్శల్ని నిజమని నిరూపణ చేస్తున్నారు. గత నెల 12న జిల్లా పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు ముందు డిడి అచ్చెన్న ముగ్గురు సహోద్యోగులతో తనకు ప్రాణహాని ఉందని పోలీ సులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఫిర్యాదును నిర్లక్ష్యం వహించడం, అనంతర కాలంలో డిడి హత్యకు గురికావడం, ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఆమోదం లేకుండానే పోసు ్టమార్టం చేయడం వంటి వరుస ఘటనలపై సం దేహాలు వ్యక్తం కావడం తెలిసిందే. జిల్లాలోని వామ పక్షాలు, అఖిలపక్షాలు, దళిత సంఘాలు శాంతి యుత నిరసన ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఇందుకు అనుగుణంగా కార్యాచరణను సైతం ప్రకటించడం తెలిసిందే. శనివారం ఉదయం నగరంలో తలపెట్టిన శాంతియుత నిరసన ర్యాలీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా పశుసంవర్థక శాఖలోని ముగ్గురు ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిందిపోయి, రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి ప్రభుత్వమే ఆస్కారాన్ని కలిగించడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలకు తావిస్తోంది. రాజకీయంలేని సమస్యను రాద్దాంతం చేయడానికి అవకాశం కల్పించడం స్వయంకృతపరాదమే అను కోవాలి. రాష్ట్రంలో మైనార్టీలు, దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయనే వాదన సమంజసమే అనిపించే భావనకు ఆస్కారాన్ని కల్పించడం స్వీయవినాశనమేనని సంగతిని గుర్తెరగాల్సి ఉంది.
అరెస్టయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్య దర్శితోపాటు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు చంద్ర, వెంకటశివ, ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, మైనుద్దీన్, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఓబులేసు, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తార్, జాతీయ నాయకులు బండి జకరయ్య ఉన్నారు. శాంతియుత ర్యాలీ అడ్డుకోవడం దుర్మార్గ మని వారు పేర్కొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారించాలి : రామకృష్ణ
డాక్టర్ అచ్చెన్న ఎంతో నిజాయితీ పరు డని, ఆయన హత్యపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేక ర్లతో మాట్లాడుతూ మార్చి 12న అచ్చెన్న కిడ్నాప్ అయిన వెంటనే, ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోకపోవడం దారుణ మన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపైనా జరుగుతున్న అకత్యాలపైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరుతున్న అఖిలపక్ష నేతలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. దళితులు, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాల్ని ఖండ ించటం నేరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సొంత జిల్లాలో దళితులపై దాడులు జరిగినా ఇంతవరకు సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. అఖిలపక్ష నాయకులను, దళిత సంఘాల నేతలను, వామపక్ష నేతలను కార్యకర్తలను పోలీసులు నిర్బంధించి హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధం చేసి కడపను పోలీసుల చేతుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా, నగర కార్యదర్శి జి. చంద్రశేఖర్, రామమోహన్, కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
అరెస్టు అప్రజాస్వామీకం : సిపిఎం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, అఖిలపక్ష పార్టీలు, సంఘాలతో కలిసి డాక్టర్ అచ్చెన హత్య ఉదాంతంపై మానస ఇన్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కును హరించడమేనన్నారు. వైసిపి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, బాధితులను భయబ్రాంతులకు గురి చేయటమేనని పేర్కొన్నారు. డాక్టర్ అచ్చెన్న హత్య ఉదాంతంపై జరుగుతున్న నిరసన, ఆందోళనలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.










