Apr 21,2023 21:53

ఫొటో : వివరాలు వెల్లడిస్తునన సిఐ గిరిబాబు

నిందితుడు అరెస్ట్‌
ప్రజాశక్తి-వరికుంటపాడు : సిఐటియు నాయకురాలు డిమాండ్‌తో ఎట్టకేలకు అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని ఎస్‌ఐ తమ సిబ్బందితో అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్‌ఐ విజరు శ్రీనివాసులు సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తూర్పు చెన్నంపల్లికి చెందిన తిపిరిబోయిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఆశ వర్కర్‌ను ఏప్రిల్‌ 14న బలాత్కారం చేయబోయాడని, ఈ హఠాత్‌ పరిణామానికి భయభ్రాంతులకు గురై ఆమె కుటుంబ సభ్యులతో జరిగిన విషయం వాపోయి 17న వరికుంటపాడులో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి వరికుంటపాడు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టి ఎట్టకేలకు శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు వారు తెలిపారు.