Apr 26,2023 21:45

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

నీరందించేలా అధికారులు చర్యలు చేపట్టాలి
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలంలోని రైతులకు నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ రైతులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో రెండో పంట వేసుకునేందుకు రైతులకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ముందుంటుందన్నారు. రైతులు కావాల్సిన విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీలో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘు, యువ నాయకులు మేకల శ్రీను, నాయకులు గండూరి శ్రీను, ఎంపిటిసి ఏ కే సుందర్‌ రాజ్‌, మద్దిబోయిన శేఖర్‌యాదవ్‌, తోటపల్లి సాగర్‌, నాయబ్‌ రసూల్‌, మాజీ కంటేపల్లి కృష్ణయ్య, మైనార్టీ నాయకులు సమీవుల్లా, కోవూరు పల్లి రైతులు, నాయకులు తదితరులున్నారు.