పరీక్ష రాయనున్న 22,395 మంది విద్యార్థులు
రాయచోటి : జిల్లాలో సోమవారం నుంచి ఈనెల 17 వరకు నిర్వహించబోయే పదో తరగతి పరీక్షలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేవారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గలో జరిగా పది పరీక్షలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 123 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 22,935 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలికలు 11,146, బాలురు 11,249 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఉదయం ఉదయం 9 : 30 గంటల నుండి 12 : 45 గంటల వరకు పరీక్షలు నిర్వహిం చనున్నారు . విద్యార్థులు అరగంటకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించమని అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు, ఇన్విజిలేటర్లుకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గడియారాలు అనుమతులు లేవు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. అలాగే పరీక్ష సెంటర్ల పరిసర ప్రాంతాల వద్ద జిరాక్స్ షాపులు కూడా మూసివేస్తున్నారు . పరీక్ష కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు . జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ 16, సిట్టింగ్స్ స్క్వాడ్ 6, ఇన్విజిలేటర్లు 1260, అదనపు సిబ్బంది ఆరుగురిని ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ బస్సులో ఉచితం
పదవ తరగతి పరీక్షలు నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సులలో విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
పగడ్బందీగా నిర్వహిస్తాం : డిఇఒ
కలెక్టర్ గిరిషా ఆదేశాల మేరకు సోమవారం నుంచి నిర్వహించబోయే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని డిఇఒ పురుషోత్తమ్ పేర్కొన్నారు. ఎక్కడా మాస్ కాపీ జరగకుండా, సిసి కెమెరా నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం ఎఎన్‌ఎంలును నియమించామని చెప్పారు. మౌలిక వసతులు ఏర్పాట్లు పూర్తి చేశాం. పది పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. . పరీక్ష కేంద్రాల వద్ద 44 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంగతులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఇఒ పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్‌జెడి
పదవ తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి వీలుగా జిల్లాలో పరీక్షా కేంద్రాలలో ఉన్న వసతులపై కడప, అన్నమయ్య జిల్లాల పరిశీలకులు ఎం.వి. కష్ణారెడ్డి ఆదివారం రాయచోటిలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నేలవారు పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదన్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు, తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో ఉండాలన్నారు. వేసవి తీవ్రత దష్ట్యా విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా ఉండడానికి ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు పరీక్ష కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఆయన రాయచోటి ఉప విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి, పాల్గొన్నారు.










