Apr 26,2023 21:46

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

నేడు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ
ప్రజాశక్తి-కావలి : కావలి రూరల్‌ మండలం, చలంచర్ల గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ గురువారం నిర్వహిస్తున్నట్లు జనప్రకాషిణి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కె.రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మనవడు డాక్టర్‌ భీమ్‌రావు యశ్వంత్‌రావు అంబేద్కర్‌ విచ్చేయిచున్నారని తెలిపారు. బుధవారం పట్టణంలోని జర్నలిస్ట్‌ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గురువారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మనవడు విచ్చేయిచున్న సందర్భంగా కావలి పట్టణంలో 3 గంటలకు అంబేద్కర్‌ బుద్ధ విహార్‌ నుంచి భారీ సంఖ్యలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ ర్యాలీలో అంబేద్కర్‌వాదులు, శ్రేయోభిలాషులు, పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు. కార్యక్రమంలో సామాజికవేత్త మాలకొండారెడ్డి, సంఘజ్యోతిబీద్మాచార్యులు, అంబేద్కర్‌ యూత్‌ఫోర్స్‌, జీవన్‌, వంశీ, మధన్‌, సన్నీ, తదితరులు పాల్గొన్నారు.