Dec 25,2022 19:38

జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై. చంద్రశేఖర్‌ రెడ్డి

జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై. చంద్రశేఖర్‌ రెడ్డి
ప్రజాశక్తి - రాయచోటిహొ: జిల్లాలో వినియోగదారులకు, రైతు లకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్‌ అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నూత నంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో గృహాలకు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఎలా ఉంది, విద్యుత్‌ బిల్లుల వసూళ్లలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో ఇఇ, డిఇ కార్యాలయాలు ఎన్ని ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?
జిల్లా వ్యాప్తంగా 4 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, 11 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయా లున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయాలు రాయ చోటి, రాజంపేట, మదనపల్లె, పీలేరులలో ఉన్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యా లయాలు రాయచోటి 3, పీలేరు 2, మదనపల్లె 3, రాజంపేట 3 కార్యాలయాలున్నాయి. సెక్షన్స్‌ 40, ఇఆర్‌ఎస్‌ 4, సబ్‌ ఇఆర్‌ఒఎస్‌ 5 , ఎ/సి సెగ్మెంట్స్‌ 6, పి/సి సెగ్మెంట్స్‌ 1, మండలాలు 30 ఉన్నాయి.
విద్యుత్‌ సర్వీసులు ఎన్ని ఉన్నాయి ?
జిల్లాలో గహాలకు 467431, వ్యాపార కోసం 45,725, పరిశ్రమలకు 2826, ఆర్‌డబ్ల్యూఎస్‌కు 18,530, వ్యవసాయానికి 1,26,716, పెద్ద పరిశ్రమల కోసం 139 సర్వీసులున్నాయి.హొహొ
జిల్లాలో సబ్‌ స్టేషన్‌లు ఎన్ని ఉన్నాయి ?
జిల్లా వ్యాప్తంగా సబ్‌ స్టేషన్లు 220 కెవి 3, విద్యుత్‌ తీగలు 384, 132 కెవి 10, విద్యుత్‌ తీగలు 503.9, 33 కెవి 183, విద్యుత్‌ తీగలు 2115.95, డిట్‌ఆర్‌/11 కెవి 84729 ,విద్యుత్‌ తీగలు 14,444.67 ఉన్నాయి. ఇంకా 13 సబ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పెట్టాం.
జగనన్న కాలనీలలో విద్యుదీకరణ పనులు ఎలా ఉన్నాయి.
జిల్లాలో 532 లేవుట్లు ఉన్నాయి. జగననన్న కాలనీలలో విద్యుత్‌ పనులు చేపడుతున్నాం. పెద్దపెద్ద లేవుట్లు పనులు పూర్తి జరగాలంటే కొంత సమయం పడుతుంది. లేవుట్లులోని లబ్ధిదారులకు డిపాజిట్‌ లేకుండా ఉచితంగా సర్వీసులు ఇస్తున్నాం. సర్వీసుతో పాటు బోర్డు మీటరు, స్వేచ్‌ 1, హాలర్‌ 1, ఎత్తు పైపు ఉచితంగా సరఫరా చేస్తున్నాం.
వ్యవసాయ (స్మార్ట్‌) మీటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు ?
జిల్లా వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లును పరిశీలించడానికి రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి గ్రామీణ, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట నియోజకవర్గంలో సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో సర్వే చేపట్టాం. మీటర్లుకు కంపెనీ వారు పదేళ్లు గ్యారెంటీ కూడా ఇస్తారు. త్వరలో జిల్లా మెత్తం సర్వీసు ఏర్పాటు చేస్తాం. అపోహలు నమ్మకుండా మీటర్లు రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు.
విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ప్రమాదాలను అరికట్టేందుకు పాడైన స్తంభాలు, చిన్నవి, విద్యుత్‌ తీగలను డిపార్ట్‌మెంట్‌ ఖర్చుతో మరమ్మతులు చేపడుతున్నాం. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు విద్యుత్‌ పరికరాలను తాకరాదు. ప్రజలకు అవగామన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.