Apr 18,2023 20:42

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల
నాలుగవ రోజుకు చేరుకున్న ప్రచార భేరి
నెల్లూరు :కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై మోడీని ఇంటికి సాగనంపాలని కోరుతూ సిపిఎం సిపిఐ రూరల్‌ మండల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార భేరి కార్యక్రమం మంగళవారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రూరల్‌ మండలంలోని కలివేల పాలెం, పెనుబర్తి, మాదరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాలలో కొనసాగింది. కలివెలపాలెం గ్రామంలో ప్రచార బేరి కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేడు బిజెపి పాలకులు మోడీ అమిత్‌ షా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని తమ అనుచరులైన గౌతమ్‌ అదాని, అంబానీలకు కట్టబెడుతూ దేశ ప్రజలపై భారాలు మోపుతున్నారని,రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా వ్యవసాయ రంగాన్నీ సంక్షోభంలోకి నెట్టారాని, దేశంలో నీ ప్రజలను మత ప్రాతిపదికన విబజించాలని చూస్తున్నారని ముస్లిం లపై దాడులు హత్యలు చేస్తున్నారన్నారు.
అలాగే మన రాష్ట్రానికి విభజన హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హౌదా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించి మన రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకునేందుకు కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం వీ రమణ, సిపిఎం రూరల్‌ మండల కమిటీ సభ్యులు ఎ గ్గోలు భాస్కరు ఎం పెంచలయ్య, ఎం పుల్లయ్య, సిహెచ్‌ పెంచలయ్య, పాదర్తి. మస్తాన య్య, సిఐటియు నాయకులు డి సురేష్‌, డి, సంపత్‌, కాలేశా,గడ్డం. సీనయ్య, తదితరులు పాల్గొన్నారు.