ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంఇఒ మస్తాన్‌వలీ
నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : నాడు-నేడు పనులు జూన్ 12వ తేదీ నాటికి పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్‌వలీ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎంపియుపిఎస్ వెంకట్రావుపల్లి పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న పిల్లర్స్ గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పిల్లర్స్ గుంతల వెడల్పు లోతు, పిల్లర్స్‌కు మధ్య నిడివి ఉండాలని, పిల్లర్స్ నిర్మించినప్పుడు తగుపాలలో సిమెంటు ఇసుక కంకర వేసే విధంగా ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు నాడు-నేడు కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










