ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ మధుసూదన్‌రావు
నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని గౌరవరం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను శుక్రవారం ఎంపిడిఒ మధుసూదన రావు పరిశీలించారు. పాఠశాల పనులకు సిమెంటు లేక నాడు-నేడు పనులు ఆగినట్లు ప్రధానోపాధ్యాయులు వివరించారు. సిమెంటు వచ్చిన వెంటనే పనులు వేగవంతం చేస్తామని హెచ్‌ఎం తెలిపారు. అనంతరం ఆయన పాఠశాల కమిటీ చైర్మన్, పిల్లలతో మాట్లాడారు. వేసవి సెలవులలో జరిగే విరు లవ్ రీడింగ్ కార్యక్రమం గూర్చి విశదీకరించి పిల్లల స్థాయిలను బట్టి అన్ని రకాల లైబ్రరీ బుక్స్ వర్కింగ్ రోజున అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఆయనవెంట మండల విద్యాశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి ఉన్నారు.










