Apr 21,2023 21:52

ఫొటో : నాడు-నేడు పనులపై అధికారులతో చర్చిస్తున్న ఎంపిడిఒ శ్రీదేవి

నాడు-నేడు పనులపై సమీక్ష
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఒ శ్రీదేవి నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో పేస్‌-2లో 35 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 974 కోట్ల 47 లక్షల రూపాయలు నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేసవికాలంలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వే
సవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల తీరుతిన్నులపై ఎంఇఒ నాగేశ్వరరావుతో కూలంకుషంగా చర్చించారు. తదుపరి అల్లూరుపేటలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎపిఎం ప్రసాద్‌, పలువురు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.