Sep 12,2022 16:56

ప్రజాశక్తి-మైలవరం :  మైలవరంలో రైల్వే లైన్ ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కు రైతులు ఫిర్యాదు చేశారు. రెండు పంటలు పండే పంట పొలాలు జీవనాధారమైన పశుసంపద ఆటంకం కలిగించే కొత్త రైల్వే లైన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రత్యాన్యాయ మార్గాలను ఆలోచించవలసిందిగా రైతులు కోరుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒరుగు సాంబశివరావు, అలవాల రామకృష్ణారెడ్డి, బొమ్మ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జోనబోయిన జమలయ్య, కోట వేణుగోపాల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.