ప్రజాశక్తి-మైలవరం : మైలవరం నియోజకవర్గ రైతులు రైల్వే లైన్ పై అభ్యంతరం తెలుపుతూ సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వినతి పత్రం అందజేశారు. విజయవాడ - మధ్యప్రదేశ్ వరకు వెళుతున్న రైల్వే లైన్ లో మైలవరం నియోజకవర్గం మరియు తిరువూరు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ఆంజనేయులు, మైలవరం సిపిఎం నాయకులు సిహెచ్ సుధాకర్, రావుల సుబ్బారావు రైతులతో కలసి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వినతి పత్రం అందజేశారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైల్వే లైన్ కు సంబంధించి సిపిఎం ఎంపీలతో పార్లమెంట్ లో ప్రస్తావించేలా చూడాలని కోరారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ బీసీ ఓసీలో పేద రైతులు భూములు కోల్పోతున్నారని మూడు పంటలు పండే భూములు కోల్పోతే భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీతారాం ఏచూరి, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు రైతులకు హామీ ఇచ్చారు.










