Sep 15,2022 11:18

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ మండలం కంచల గ్రామంలో ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేరయ్య 162వ జయంతి వేడుకులు  నిర్వహించారు. టిడిపి నందిగామ మండల అధ్యక్షులు వీరంకి వీరాస్వామి పాల్గొని  విశ్వేరయ్య  చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరాస్వామి మాట్లాడుతూ మోక్షగుండం విశేస్వరయ్య  భారత దేశపు ప్రముఖ ఇంజినీర్ అనీ, ఆయనకు 1955 సంవత్సరంలో భారతదేశపు అత్యంత పురస్కారం అయినా భారత త్న ఆయనకు లభించిందని తెలిపారు. అంతేకాకుండా ఆయన ప్రజలకు చేసినా సేవలను గుర్తించి ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం ''జార్జి నయిట్ కమాండర్ ఆఫ్ థీ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ " బిరుదు ఇచ్చి సత్కరించారని వీరాస్వామి పేర్కొన్నారు. భారత దేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నామని, వారి సేవలను కొనియాడారు.