Nov 24,2022 21:58

ఆటోనగర్‌ వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌

         హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలోని మురికివాడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ఇక్బాల్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆటోనగర్‌ ప్రాంత ప్రజలు ఎమ్మెల్సీని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆటోనగర్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆటోనగర్‌ అభివృద్ధి జరగలేదన్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ఆర్థికలోటు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామిలను పూర్తిగా నెరవేరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఆటోనగర్‌లో రూ.97.50లక్షలతో మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు సిసి రోడ్డు, విధ్యుత్‌ దీపాలతో ఇతర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అదేవిధంగా డ్రైవర్స్‌ కాలనీలో సైతం మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, కౌన్సిలర్లు సునీత, వెంకటేశ్వర్‌రెడ్డి, రహమాత్‌బీ, ఆటోనగర్‌వాసులు పాల్గొన్నారు.