Feb 28,2023 19:17

ప్రచారం చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి -ఉలవపాడు :మార్చి 13న జరిగే ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిఐటియు, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలో 2 దళాల ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలలో, సచివాలయాల్లో గిరిజన గురుకుల పాఠశాలలు, కేజీబివి విద్యాసంస్థల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించారు. సిఐటియు నెల్లూరు జిల్లా నాయకులు జివిబికుమార్‌, ఉలవపాడు మండల కార్యదర్శి ఎస్‌డి గౌస్‌ బాషా, యూటీఫ్‌ జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు ఏ. గోపాల్‌ రెడ్డి, యుటిఎఫ్‌ ఉలవపాడు మండల మండల అధ్యక్ష, కార్యదర్శులు జి. నాగేంద్రకుమార్‌, ఎస్‌.జాలయ్య, బి.కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్‌, భాస్కర్‌ రాజా పాల్గొన్నారు.