Apr 07,2023 18:44

అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి : మూల్యాంకనం విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. హరిప్రసాద్‌, ఎస్‌. జాబీర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన విధులను నుంచి చంటి బిడ్డల తల్లులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉపాధ్యాయులు 60 సంవత్సరాలు పైబడి వయస్సు కలిగిన ఉపాధ్యాయులను జిల్లా కేంద్రం నుంచి దూరం ప్రాంతాల వారికి మినహాయింపు నివ్వాలిన్నారు. మూల్యాంకన కేంద్రంలో గాలి వెలుతురు ఉండే గదులను ఉపయోగించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ ఉపాధ్యాయులకు సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు.