సిఎంతో 'తూమాటి'
ప్రజాశక్తి -కందుకూరు : ఎపి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాతమూర్తి ఆదిమూలపు థెరిసమ్మ మృతిచెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి యర్రగొండపాలెం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంఎల్‌సి తూమాటి మాధవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎంతో కలిసి ఆయన మంత్రి ఆదిమూలపు సురేష్‌ని పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.










