Apr 08,2023 21:25

'ముదివేడు' నిర్వాసితులకు పరిహారం చెల్లించాలిసమస్య పరిష్కారమయ్యే వరకూ పోరాడుదాం

కురబలకోట : ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా, కాలయాపన చేయడమే కాకుండా కాంట్రాక్టర్లకు వంతపాడటం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం ముదివేడు రిజర్వాయర్‌ను సందర్శించి, ముంపు గ్రామాలైన శీతివారిపల్లి, కొత్తపల్లి, చౌటకుంటపల్లి ప్రజలను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూములను తీసుకున్నప్పుడు గ్రామసభలు జరిపి, నోటీసులు అందించి, అందరూ ఆమోదించిన అనంతరం అవార్డు ప్రకటించి, నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. తర్వాత నిర్మాణ పనులను ప్రారం భించాలన్నారు. నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.12 లక్షలు ఇస్తామని నోటిమాట ద్వారా చెప్పడం దుర్మార్గమన్నారు. ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఎకరాకు రూ.40 లక్షల పరిహారం, ఇంటికొక ఉద్యోగం, భూమిలేని కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లకు రెవెన్యూ అధికా రులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రామాలు పూర్తిగా మునిగిపోయి కనుమరుగవుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వకపోవడం అత్యంత హేయమన్నారు. రిజర్వాయర్‌ ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, భూమికి ప్రత్యామ్నాయ భూమి చూపించాలని, ఎకరాకు రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో చేసిన చట్టాలు కాపాడాల్సిన స్థానిక పార్లమెంట్‌ సభ్యులు మిథున్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ద్వారకనాథ్‌రెడ్డిలు ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేసేంత వరకూ నిర్వాసితులతో కలసి పోరా డుతామని హెచ్చరించారు. అధికారులు పక్షపాత ధోరణి వదలి నిర్వాసితులు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా ఉద్యమం నిర్వహించినప్పుడే సమస్యలు పరిష్కారం అవు తాయని, అందుకు ప్రజ లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, నాయకులు అబ్బవరం రామాంజులు, ప్రభా కర్‌రెడ్డి, సిహెచ్‌.చంద్రశేఖర్‌, రవికుమార్‌, నిర్వాసితులు పాల్గొన్నారు.