మతోన్మాద బిజెపిపై ఉద్యమిస్తాం..
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రజలందరూ ఏకధాటిగా ఉద్యమించి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఎం మండల అధ్యక్షులు మైపాటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం లేబూరు గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచారభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాల అందిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం సిపిఎం మండల అధ్యక్షులు మైపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతివ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అదానీ, అంబానీ లాంటి అతిసంపనులకు దేశ సంపదను దోచిపెట్టడమే పనిగా మోడీ ప్రభుత్వం ఉందన్నారు. దేశ ప్రజలు ఇకనైనా మేల్కొని మోడీ నిరంకుశ పాలన నుండి బయటపడడానికి గళమెత్తలానీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు తిక్కవర ప్రభాకర్ రెడ్డి, సిపిఐ మండల అధ్యక్షులు షాన్వాజ్, కవులు రైతు సంఘం నాయకులు వెన్నువేను, కాండ్రాతి రవీంద్ర, కోముజుల వెంకటేశ్వర్లు, నరసింహులు ఎస్కే కరిముల్లా, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.










