మతోన్మాద బిజెపిని సాగనంపుదాం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై మోడీని ఇంటికి సాగనంపాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలోని వాసిలి గ్రామంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజలను సమాయత్తం చేస్తూ వారికి కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ నేడు బిజెపి పాలకులు మోడీ, అమిత్ షా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ తమ అనుచరులైన అదాని, అంబానీలకు కట్టబెడుతూ దేశ ప్రజలపై భారాలు మోపుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.










