ప్రజాశక్తి -కందుకూరు :గత ఏడాది డిసెంబర్ 28న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతిచెందగా టిడిపి తరపున పలువురు పార్టీ నేతలు ప్రకటించిన 22.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇదివరకే బాధిత కుటుంబాలకు అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన భాష్యం ప్రవీణ్ ప్రకటించిన లక్ష రూపాయలు, విజయనగరం జిల్లా బొబ్బిలి టిడిపి ఇన్‌ఛార్జి రంగారావు (బేబీ నాయన) ప్రకటించిన 50 వేలు విలువైన చెక్కులను మంగళవారం అందజేశారు. కందుకూరు లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల వెంకటసుబ్బారావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే ఉన్నారు.










