Feb 23,2023 22:55

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే పనులను మరింత వేగవంతం చేసి ఆయా గ్రామాల్లో ఏప్రిల్‌ 15 నాటికి గ్రౌండ్‌ టు థింగ్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. విజయవాడ సిసిఎల్‌ఏ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, రీసర్వే, మ్యూటేషన్స్‌ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సిసిఎల్‌ఎ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్యతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొదట విడత కింద 26 గ్రామాల్లో, రెండవ విడత కింద 29 గ్రామాల్లో రీసర్వే చేపట్టామన్నారు. ఈ గ్రామాల్లో ఏప్రిల్‌ 15 నాటికి గ్రౌండ్‌ టు థింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను అధిగమించి రీ సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఐఒఎస్‌లు కపాకర్‌, శాంతరాజ్‌, డిఐఒలు నరేంద్ర, శామ్యూల్‌, చంద్రశేఖర్‌, చిట్టిబాబు, అంజలీదేవి, మోహన్‌, మురళీ, చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.
మండలి ఎన్నికలకు కేంద్రాలు ఏర్పాటు
పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల మండల ఎన్నికల కోసం జిల్లాలో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, రిసెప్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్పోర్ట్స్‌ రూమ్‌ని స్ట్రాంగ్‌ రూమ్‌గా ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, రిసెప్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్పోర్ట్స్‌ రూమ్‌ని స్ట్రాంగ్‌ రూమ్‌గా ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గానికి సంబంధించి పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, రిసెప్షన్‌ కేంద్రాన్ని, పుట్టపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్పోర్ట్స్‌ రూమ్‌ని స్ట్రాంగ్‌ రూమ్‌గా ఏర్పాటు చేశామన్నారు.