Jan 01,2023 22:10

ఫొటో : మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపిపి దర్శిగుంట శశిరేఖ

మంత్రిని కలిసిన ఎంపిపి
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని ఆదివారం ఎంపిపి కుమారి దర్శిగుంట శశిరేఖ నెల్లూరులోని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, కావలి మాజీ ఎఎంసి చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డిలను కలసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బీద రమేష్‌, దర్శిగుంట వెంకయ్య, తంబి వాసు తదితరులున్నారు.