Apr 26,2023 18:59

పరామర్శిస్తున్న కాకాణి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :వైసిపి కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌ తండ్రి సుబ్రహ్మణ్యం గౌడ్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న సుబ్రహ్మణ్యం గౌడ్‌ను చికిత్స కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో వైద్య శాలలో చేర్పించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు చెన్నై తరలించారు. చికిత్స అనంతరం సుబ్రహ్మణ్యం గౌడ్‌ స్వగ్రామం తోటపల్లిగూడూరు మండలం వరకువిపూడి పంచాయతీ అనంతపురం వచ్చారు. సమాచారం అందుకొన్న వెంటనే మంత్రి గోవర్ధన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్‌ ను కలిసి పరామర్శించారు. సుబ్రహ్మణ్యం గౌడ్‌ ఆరోగ్య పరిస్థితి శంకరయ్య గౌడ్‌ ను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గోవర్ధన్‌ రెడ్డి వెంట వైసిపి నాయకులు, ముత్తుకూరు జెడ్పీటిసి నెల్లూరు ప్రసాద్‌, మెట్టా విష్ణువర్ధన్‌ రెడ్డి, మునుకూరు రవికుమార్‌ రెడ్డి ఉన్నారు.