Sep 20,2022 22:44

ప్రజాశక్తి వీరులపాడు
మండల కేంద్రాన్ని తరలించడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్ని స్తున్నారని, ఆ ప్రయత్నం వెంటనే విరమించుకోకపోతే అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని రైతు నాయకులు ఒట్టి కొండ చంద్రమోహన్‌ అన్నారు. మండల కేంద్రం తరలింపు ప్రక్రియకు వ్యతిరేకంగా వీరులపాడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు కలిగిన మండల కేంద్రంని వీరులపాడు గ్రామం నుండి జుజ్జూరు గ్రామానికి తరలిస్తే సహించేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మండల కేంద్రం తరలింపు ప్రక్రియని ఒప్పుకోబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కన్నమాల సురేష్‌, వట్టికొండ చంద్రమోహన్‌, ఎంపీటీసీ సభ్యులు మండూరు ప్రకాష్‌రావు, కోడూరి పిచ్చెశ్వరరావు, చావా శివాజీ, చావా కోటేశ్వరరావు, వట్టికొండ పార్థసారథి, వాసిరెడ్డి రాధాకష్ణ, చావా ప్రసాద్‌ పాల్గొన్నారు.