Sep 18,2022 23:04

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 54వ డివిజన్‌లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 54వ డివిజన్‌లోని 174వ సచివాలయం పరిధిలో అదివారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్‌లో.కొంత మంచినీటి సమస్య ఉందని కొందరు తమ దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే పైపులైన్లు బాగుచేయించమని చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ నగరానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్‌, గాంధీ హిల్‌ వద్ద నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ అబ్దుల్‌ అర్షద్‌ అకీబ్‌తో కలిసి ఎమ్మెల్యే ఆదివారం చెట్లను నాటారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరీ భాగస్వామ్యంతో నగరాన్ని కాలుష్య రహిత నగరంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. గట్టువెనుక ప్రాంతమైన విద్యాధరపురం సితార సెంటర్‌లో విజయదుర్గ గూడ్స్‌ ఆటో ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వైయస్‌ఆర్‌టియుసి యూనియన్‌ ఆటో స్టాండ్‌ను వెలంపల్లి శ్రీనివాసరావు, రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నగర అధ్యక్షులు విశ్వనాధ రవి, రాయన నరేంద్ర, మైలవరపు కష్ణ తదితరులు పాల్గొన్నారు. కబేళా సెంటర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఉర్దూ)లో రూ.38 లక్షల నాడు-నేడు అభివద్ధి నిధులతో అభివృద్ధి పనులను ఆదివారం వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.