ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -పొదలకూరు :ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం పొదలకూరు మండల వైద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో రామ్ నగర్ సెంటర్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రమేష్ మాట్లాడారు.. ప్రజలు మలేరియా బారిన పడకుండా వుండేందుకు దోమతెరలు వాడాలన్నారు. మలేరియా విభాగం సబ్ యూనిట్ అధికారి ఆంజనేయ వర్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆదిలక్ష్మి , ఆరోగ్య విస్తరణాధికారులు రవికుమార్, శ్రీనివాసులు, ఆరోగ్య పర్యవేక్షకులు రమణమ్మ, ఆరోగ్య సహాయకులు రాధా కుమారి సాని శివప్రసాద్, కామాక్షమ్మ ఉన్నారు.










