ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - లింగసముద్రం : మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి ఆరాధనకు వచ్చిన భక్తులకు కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో మజ్జిగ,మంచినీళ్లు ప్యాకెట్లను పంపిణీ చేశారు. గురువారం మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులకు ప్యాకెట్లును అందజేశారు. మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి,పల్లపోతు వెంగళరావు,కిలారి వెంకటేశ్వర్లు,మహేష్ ఉన్నారు.










