జాతీయ స్థాయిలో రెండవ స్థానం సాధించిన ఆసీఫుల్లా
హిందూపురం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో హిందూపురానికి చెందిన ఆసీఫుల్లా రెండవ స్థానం సాధించాడు. ఆసీఫుల్లా పట్టణంలో గోల్డెన్ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. గతేడాది రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ఆదివారం ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో పోటీల్లో ఆయన రెండవ స్థానంలో నిలిచి హిందూపురం పేరును జాతీయస్థాయిలో చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆసీఫుల్లా మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కఠోర శ్రమతో తనకు ఈ స్థానం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి హిందూపురానికి మంచి పేరును తీసుకొస్తానన్నారు.










