రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ అధ్యక్షులు కృష్ణప్రభు
ప్రజాశక్తి-విజయవాడ
మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తే ఆ సమాజం మరింతగా పురోగమిస్తుందని రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ప్రెసిడెంట్ ఎం.కృష్ణప్రభు అన్నారు. ఎంబివికె, రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో మూడు నెలల బ్యూటీషియన్ శిక్షణ, ఎంబివికె ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందించే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రధాన ధ్యేయంగా ఎంబివికెతో కలిసి గత మూడు నెలల క్రితం నుండి బ్యూటీషియన్ కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. రోటరీక్లబ్ ద్వారా రాబోయే ఆరు నెలల్లో కుట్టుమిషన్‌ల శిక్షణ ఇచ్చి తద్వారా 500 మందికి కుట్టుమిషన్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంబివికె మహిళలలో స్వయం పోషకత్వం పెంచడానికి పలు కోర్సుల్లో శిక్షణ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె మహిళా విభాగం బాధ్యులు పి.విజయ, బాధ్యులు యు.వి .రామరాజు, క్లబ్ కార్యదర్శి కెఎస్‌ఎన్ బాబు, అడ్వయిజర్ కిషన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ కోనేరు మధు, మాజీ ప్రెసిడెంట్ వై.పార్థసారథి, బ్యూటీషియన్ కోర్సు ప్రధాన శిక్షకురాలు శాఖమూరి విశాల, ప్రణవి, సిహెచ్ పద్మ, టైలరింగ్ కోర్సు శిక్షకురాలు ఫాతిమా, కంప్యూటర్ శిక్షకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం ఆయా కోర్సులలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్‌లను అందజేశారు.










