Feb 28,2023 19:22

మాట్లాడుతున్న సిపిఐ కార్యదర్శి సురేష్‌ బాబు

ప్రజాశక్తి -కందుకూరు :మార్చి 2న సిపిఐ రాష్ట్ర సమితి తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్‌ బాబు తెలిపారు. స్థానిక కోటారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేష్‌ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం తక్షణమే రూ. 5 లక్షల మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మాలకొండయ్య మాట్లాడారు. సిపిఐ కౌన్సిల్‌ సభ్యులు ఎం లక్ష్మీనారాయణ, ఎం సీతారామయ్య పాల్గొన్నారు.