Jul 24,2021 14:46

ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే వ్యక్తులు.. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలను ఒడిలో మోసుకెళ్లే మహిళల కోసం తమ సీట్లను ఆఫర్‌ చేస్తుంటారు. తాజాగా ఓ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న యువకుడికి.. తన ముందు నిల్చున్న అమ్మాయి చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు కనిపించడంతో ఆ యువతికి తాను కూర్చున్న సీటును ఆఫర్‌ చేశాడు. ఆ ఆఫర్‌ను ఆమె సంతోషంగా అంగీకరించి... యువకుడి సీట్లో కూర్చుంది. అలా కూర్చున్న తర్వాత ఆమె చేతిలో ఉన్న దుప్పటిని తీయడంతో.. చంటి బిడ్డకు బదులు. టెడ్డీ బేర్‌ ఉండడం చూసి అతను షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'నీ దయార్థ హృదయం నాకు నచ్చింది' అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మరో నెటిజన్‌ 'సీటు కోసమే అలా చేసిందా.. లేక యాధృచ్ఛికంగా జరిగిందా..?' అంటూ ప్రశ్నించాడు. ఇది ఎక్కడ.. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను మీరూ చూసేయండి : https://www.instagram.com/reel/CQBeSFFFNho/?utm_source=ig_web_copy_link