Dec 26,2022 19:50

పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డాక్టర్‌ లక్ష్మి

- డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లక్ష్మి
ప్రజాశక్తి-వాల్మీకిపురం : ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని జర్రావారిపల్లి పంచాయతీ వడ్డిపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఏ రోగిని రెఫర్‌ చేయకూడదన్నారు. గ్రామాల్లోనే ప్రతి చికిత్సకు వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు హౌం విజిట్‌ ఏయాలని, ప్రతి నెల గర్భిణీలను పరీక్షించి, ఐఎఫ్‌ఏ మందులను పంపిణీ చేయాలని సూచించారు. లెప్రసీ సర్వే, టిబి సస్పెక్ట్‌ ప్రతి రోజు పంపాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నయీమ్‌, మణిభూషన్‌, హెచ్‌ఇఒ సత్యనారాయణ, ఎంపిహెచ్‌ఈవో శ్రీనివాసులు, ఎంపిహెచ్‌ఎస్‌ మురళి, సిబ్బంది నాగిరెడ్డి, మౌనిక, ఎఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.