Feb 27,2023 21:44

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

మేధావులు, విద్యావంతులు డబ్బుకు లొంగరు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : శాసనమండలి ఎన్నికలలో పోటీచేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థులు మేధావులు, విద్యావంతులు అని వారు డబ్బుకు లొంగరని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) శాసనమండలి ఎన్నికలలో పోటీ చేస్తున్న పట్టభద్రుల ఎంఎల్‌సి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబు రెడ్డిలను గెలిపించాలని ఆత్మకూరు పట్టణంలోని మెయిన్‌ బజార్‌ బి.ఎస్‌.ఆర్‌. సెంటర్‌ ప్రాంతాలలో ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యుదయ వాదులుగా ఉన్న ప్రగతి మార్గాన్ని నడిపిస్తున్న గతంలో విఠపు బాలసుబ్రమణ్యం, వై శ్రీనివాస్‌ రెడ్డి ఇద్దరు పోటీ చేసి గెలిచినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ స్థానంలోకి ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. వీరిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కాంట్రాక్ట్‌ కార్మికుల పక్షాన శాసనమండలలో పోరాడతారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ డబ్బుకు లొంగకుండా ఓట్లు వేయాలని ఓట్లను అభ్యర్థించారు. ప్రపంచవ్యాప్తంగా దేశంలో గానీ రాష్ట్రంలో గానీ విద్య, వైద్యం ఖరీదు అయిపోతున్నాయని తెలిపారు. సామాన్య మానవుడికి అందుబాటులో లేదని, ఈ రెండింటిని సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజాబడిని కాపాడుకుందామని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేలా అభ్యుదయవాదులను గెలిపించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు షేక్‌ సంధాని, ఆళ్ల హజరత్తయ్య, విశ్రాంతి డైట్‌ లెక్చరర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.