Sep 17,2022 22:41

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు వేతనం ఇవ్వాలని సిఐటియు మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ సుప్రజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగ్గయ్యపేట పట్టణంలోని సిఐటియు కార్యాల యంలో శనివారం జగ్గయ్యపేట మండల మధ్యాహ్న భోజన పథకం సిఐటియు మహసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రజా మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి అయ్యేటటువంటి గ్యాస్‌ మొత్తాన్ని ప్రభుత్వమే సరపర చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రెండు జతల యూనిఫామ్‌ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మధ్యాహ్న పథకం మండల కార్యదర్శిగా పద్మ, అధ్యక్షురాలుగా మాదారిబి, గౌరవాధ్యక్షులుగా షేక్‌ గౌస్‌, మియాలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ గౌస్మియా, ఎస్‌ రామనాథం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు.