Apr 08,2023 20:04

మా భవిష్యత్తు..నమ్మకం నువ్వే జగన్‌ : ఎమ్మెల్యే

వీరబల్లి : ప్రజలు ఏ ఇంటికి వెళ్లిన జగనన్నే మా భవిష్యత్తు అంటున్నారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సంఘం వాండ్లపల్లి పంచాయతీ సర్పంచ్‌ దయ్యాల కష్ణయ్య, ఎంపిపి రాజేంద్రనాధ్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, గహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో కలిసి ఉత్సాహంగా ''జగనన్న నువ్వే మా భవిష్యత్తు'' మా నమ్మకం నువ్వే జగన్‌ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలన పై ప్రజల్లో అపారమైన విశ్వాసం వ్యక్తమైందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అర్హుల చెంతకే చేరాయని సంతప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా వైసిపి పాలనలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి, జడ్‌పిటిసి శివరాంగౌడ్‌, సర్పంచ్‌ దయ్యాల కష్ణయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ అమర్నాథ్‌రెడ్డి, ఎంపిటిసి ఆంజనేయులు, సర్పంచ్‌ గోపీనాథ్‌ రెడ్డి, బ్రహ్మయ్య, వెంకటస్వామి, లోకేష్‌, చిన్న కష్ణ, రమేష్‌, రామ్మోహన్‌, విశ్వనాధరెడ్డి, పోలీస్‌ సిబ్బం, మండల నాయకులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : 'జగనన్నే మా భవిష్యత్తు -మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాన్ని రాచవేటివారిపల్లి పంచాయతీ ఎగువమాచిరెడ్డిగారి పల్లెలో వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ.రమణారెడ్డి, ఆర్‌బికె. చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్‌ రామమోహన్‌ రెడ్డి, సర్పంచు సుబ్రమణ్యం, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొమ్మేపల్లి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిటిసి రెడ్డివెంకటేష్‌, సర్పంచులు సుబ్రమణ్యం, చండ్రాయుడు, సచివాలయ కన్వీనర్లు పి.షావల్లి, శోభ, రవీంద్రనాథ్‌రెడ్డి, నాయకులు నరేంద్రరెడ్డి, చంద్రారెడ్డి, దొర, శ్రీనివాసులురెడ్డి, నవీన్‌, రెడ్డిభాస్కర, హేమంత్‌, యుగంధర్‌ రెడ్డి, నాగరాజా, శంకర, గంగాధర, రామారావు, చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.నందలూరు : వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అర్హులైన ప్రతి పేదవానికి కుల మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిదేనని ఎంపిపి మేడా విజయభాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆడపూరు పంచాయతీలో నువ్వే మా నమ్మకం జగనన్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చైతన్య భారతి, జడ్‌పిటిసి గడికోట ఉషా సుబ్బారెడ్డి, వక్ఫ్‌బోర్డ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యులు కలీం, రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీ నరసయ్య, ఎంపిటిసి తుమ్మల భావన శ్రీధర్‌గౌడ్‌ , వైసిపి నాయకులు నందలూరు భాస్కర్‌రెడ్డి, నడివీధి సుధాకర్‌, సుబ్బారెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఓబులవారిపల్లి : జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బాలిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఎపి టూరిజం డైరెక్టర్‌ సాయి కిషోర్‌రెడ్డి, బిసి నాయకులు ఈశ్వరయ్య, బాబురెడ్డి, రామచంద్రారెడ్డి, విజయారెడ్డి, చత్రరెడ్డి, జయవర్ధన, మహేష్‌లు పాల్గొన్నారు.మదనపల్లె అర్బన్‌ : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి నవ రత్నాలు గురించి వివరించడం జరుగుతోందని జిల్లా వర్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌ఎ.కరీముల్లా అన్నారు. పట్టణంలోని 14 వ వార్డులో కౌన్సిలర్‌ షేక్‌ షబానాతో పాటు వార్డు కన్వీనర్లు, గహ సారధులు, సచివాలయం కార్యదర్శులతో కలసి ఇంటింటికి వెళ్ళి, కుటుంబ సభ్యులను పలకరిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అందుతున్న పథకాలను వివరిస్తు స్టికర్లు అంటించారు. కలకడ: మండలంలోని బాటవారిపల్లె నీలప్పగారిపల్లి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌లు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలలో మమేకమై ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్‌, రెడ్డప్ప, శ్రీనాథ్‌ సచివాలయం కన్వీనర్‌ నాగరాజ, ఉదరు భాస్కర్‌, సునీత వాలంటీర్స్‌ పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని అప్పయ్య రాజుపేట గ్రామంలో నాడు సయ్యద్‌ ముస్తాక్‌, మండల సచివాలయాల కన్వీనర్‌ నాగిరెడ్డి హరినాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న మా నమ్మకం నువ్వే - జగనన్నే మా భవిష్యత్‌ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నినాదంతో ముద్రించిన స్టిక్కర్లను యజమాని అనుమతితోనే అతికిస్తామని తెలిపారు. 2024 సంవత్సరంలో జగనన్న భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. క్రార్యక్రమంలో సయ్యద్‌ రిజ్వాన్‌ పాల్గొన్నారు.