ప్రజాశక్తి-మడకశిర ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్యకు కారకులైన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మనూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు 18 రోజుల క్రితం ప్రేమపేరుతో వేధించడంతో తమ బిడ్డ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటీవల ప్రేమ పేరుతో గ్రామానికి చెందిన యువకుడు వేధించడంతో తమ కుమార్తె పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మతి చెందిందన్నారు. దీంతో ఈనెల 9వ తేదీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ బిడ్డకు కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మనూరు గ్రామస్తులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం










