Mar 05,2023 22:12

క్లబ్‌ మాజీ అధ్యక్షులు గోసే రాధాక్రిష్ణకు సర్టిఫికెట్‌ అందజేస్తున్న లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : దేశవ్యాప్తంగా లయన్స్‌ క్లబ్‌ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని, ధర్మవరంలో కూడా మరింత సేవలను విస్తృతం చేయాలని లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ రామచంద్ర ప్రకాశరావు పిలుపు నిచ్చారు. లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ ధర్మవరం పర్యటనలో భాగంగా లయన్స్‌ కంటి ఆస్పత్రికి ఆదివారం వచ్చారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని స్థానిక లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధిలతో గవర్నర్‌ పలు అంశాలు, సేవలపై చర్చించుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టారు. లయన్స్‌ క్లబ్‌ ఫౌండర్‌ పిట్టా వెంకటస్వామిసేవలను ప్రశంసిం చారు. అదేవిధంగా క్లబ్‌ మాజీ అధ్యక్షుడు గోసేరాధాక్రిష్ణ ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ లయన్స్‌కు వెయ్యి డాలర్లు విరాళంగా ఇచ్చిన సందర్భంగా ఆయనకు మెమెంటో, సర్టిపికెట్‌తో పాటు బంగారు లయన్‌ డాలర్‌ను గవర్నర్‌ బహుకరించారు. అనంతరం ఎన్విరాన్మెంట్‌, డయాబెటీస్‌, క్యాన్సర్లపై అవగాహన సదస్సు తదితర కార్యక్రమాలను చేపట్టాలని గవర్నర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ క్యాబినెట్‌ సెక్రటరీ సుబ్రమణ్యం, కోశాధికారి కృష్ణమూర్తి, అడిషనల్‌ కోశాధికారి చంద్రమోహన్‌, ధర్మవరం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు చందానాగరాజు, సభ్యులు ఉట్టిశివప్రసాద్‌, మెటికల కుళ్లాయప్ప, గూడూరు వేణుగోపాల్‌, నరసింహులు, టీచర్‌ వేణుగోపాల్‌, పిఇటిలు రమేశ్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.