May 27,2022 23:18

మాట్లాడుతున్న జిల్లా జడ్జి గోపి

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌ చక్కని వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు హాలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలుమార్లు నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో అనేక పెండింగ్‌ కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. న్యాయ సమ్మతమైన కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. వచ్చే నెల 26న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి ఎక్కువ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడుతో పాటు ఇన్సూరెన్స్‌, చిట్‌ఫండ్‌ కంపెన్సీలు, ఇన్సూరెన్స్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌, పిటిషనర్‌ న్యాయవాదులు హాజరయ్యారు.