ప్రజాశక్తి-మైలవరం: పల్నాడు జిల్లాలో ఆశ వర్కర్ రామవత్ లీలావతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు, ఆశ వర్కర్లు సోమవారం అందోళన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ శ్రీహరికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సీహెచ్.సుధాకర్, నాయకులు పత్తిపాటి జ్యోతి, కె.విజయ, సంతోషం, పార్వతి, దుర్గా, జయ, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-గంపలగూడెం: స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జానపాటి వెంకటేశ్వరరావు, జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షులు గువ్వల సీతారామిరెడ్డి, ఆశా వర్కర్లు పంది సుమలత, పూచిక చంద్రకళ, కొంగల సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్యాలయపు సీనియర్ అసిస్టెంట్ లావణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎస్.కె గౌస్‌మియా, నాయకులు ఎస్ రామనాథం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటరమణ, ఎస్ శారద, కె బేబీరాణి, డి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాచేసి డిప్యూటీ తహశీల్దార కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు వరలక్ష్మి, చిట్టెమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. ప్రజాశక్తి-రెడ్డిగూడెం: రెడ్డిగూడెం తహసీల్దార్ పాల్‌కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు వరలక్ష్మి, తిరపతమ్మ, రజిని పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామ తహశీల్ధార్ కార్యాలయంలో ఆశావర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కే గోపాల్, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు వసంత, దుర్గ, విజయలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.










