ప్రజాశక్తి-గాండ్లపెంట వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని వేపరాల సచివాలయ పరిధిలో ఉన్న సీఎం తండా, దళితవాడ, వేపరాల, తాళ్లకాలవ తదితర గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ సిఎం అయ్యాక పేదల వద్దకే సంక్షేమం వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డి.అంజన్నప్ప, ఆర్‌ఐ అశోక్ చక్రం, ఎఒ లక్ష్ష్మీప్రియ, ఎంపిపి టి.జగన్మోహన్, వైసిపి మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎస్.ఫయాజ్‌అలీ, ఎంపిటిసి జి.సోమశేఖర్‌రెడ్డి, సర్పంచులు ఉమాదేవి, రవీంద్రనాయక్, ఆంజనేయులు, ఆర్‌బికె ఛైర్మన్ శంకర్‌నాయుడు, పామిడి మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్, ఫరూక్, లోకేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : మండలంలోని చోలేమర్రిలో గురువారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు అందజేశౄరు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, కలిపి శ్రీనివాసులు, రాజారెడ్డి, కన్వీనర్ బోయ తిమ్మయ్య, ఎంపిటిసిలు సర్పంచులు, స్థానిక నాయకులు, తదితరలుఉ పాల్గొన్నారు.
గాండ్లపెంట మండలంలో మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి










