Sep 27,2023 22:49

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: విజయవాడ రైల్వే స్టేషన్లో రక్షక్‌ మరియు పద్మావతి కాంట్రాక్ట్‌ సంస్థలు చట్టవిరుద్ధంగా పనిలో ఆపబడిన కార్మికులు పని కావాలని చేస్తున్న నిరసన ధర్నాలు 76వ రోజుకు చేరింది. బుధవారం డిఆర్‌ఎం కార్యాలయం వద్ద ఖాళీ పళ్ళాలతో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.వెంకటేశ్వరరావు, ఎన్‌.సి.హెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడుతూ కార్మికులను తెప్పించడానికి రైల్వే అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని, జీవో ప్రకారం వెంటనే పనిలో పెట్టించాలని కోరారు. చట్ట విరుద్ధంగా పనిలో ఆపి కార్మికులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అక్టోబర్‌ నెల నుండి పోరాటాన్ని మరింత ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.