Sep 26,2023 23:31

ఎపి కౌలు రైతు సంఘం ఖండన

ప్రజాశక్తి - విజయవాడ : గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరుపై నూతన హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ సిపిఎం చేపట్టిన 'చలో అసెంబ్లీ'ని అడ్డుకునేంందుకు ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆ పార్టీ ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ ఖండించారు. సిపిఎం గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేటలకు చెందిన 23 మంది మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారని తెలిపారు. ఈ బ్రిడ్జి కూలిపోయి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు నూతన బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తిరువూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి అట్టహాసంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ ప్రకట చేసి ఇప్పటికి ఆరు నెలలవుతున్నా బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఎన్ని రోజులు గడుపుకుంటూ పోతారని ప్రశ్నించారు. వైసిపి నేతలు రోజుకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిఎంను కలిసి తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరేందుకు సిద్ధమైన సిపిఎం నేతలను రెండురోజుల పాటు అరెస్టు చేయించటం శోచనీయమని పేర్కొన్నారు. నిధులు విడుదల చేసి కట్టలేరు హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణం వెంటనే ప్రారంభించాలని, అరెస్టుచేసిన సిపిఎం నేతలను వెంటనే విడుదల చేయాలని డివి.కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
ఎపి కౌలు రైతు సంఘం ఖండన
బ్రిడ్జి నిర్మాణానికి ఆందోళన చేపట్టిన సిపిఎం నేతల అక్రమ అరెస్టులను ఎపి కౌలు రైతు సంఘం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు ఖండించారు. 2018 జూలై, ఆగస్టుల్లో వచ్చిన అధిక వర్షాలు, వరదలకు వినగడప బ్రిడ్జి కూలిపోయిందని గుర్తుచేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వాలు మారినా కొత్త బ్రిడ్జి నిర్మించలేదని విమర్శించారు. బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
'చలో అసెంబ్లీ'ని అడ్డుకున్న పోలీసులు
నేతల ముందస్తు అరెస్టు
గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట : ఎన్‌టిఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరుపై ఐదేళ్ల క్రితం కూలిపోయిన వంతెన స్థానంలో హై లెవల్‌ వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన 'చలో అసెంబ్లీ'ని పోలీసులు అడ్డుకున్నారు. వంతెనపై
కట్టలేరుపై వంతెన నిర్మించాలి
తరచూ రాకపోకలు సాగించే తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు పోలీస్‌ మండలాలకు చెందిన 26 మంది సిపిఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పోలీసుస్టేషన్లకు తరలించి నిర్బంధించారు. అరెస్టయిన వారిలో సిపిఎం గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల కార్యదర్శులు గువ్వల సీతారామిరెడ్డి, జెట్టి వెంకటేశ్వరరావు, నాగరాజు, తిరువూరు పట్టణ నాయకులు పంతంగి శ్రీనివాసరావు, ఆకుల రవి, బి.వెంకటేశ్వరరావు, చప్పిడి సురేష్‌, సిహెచ్‌.సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు ఎస్‌వి.భద్రం, గొల్లమందల తండా సర్పంచ్‌ డి.రాముడు తదితరులు ఉన్నారు. తిరువూరు స్టేషన్లో ఉన్న నేతలను సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.సిహెచ్‌. సుప్రజ పరామర్శించారు. నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. అరెస్టయిన వారిలో ఇంకా సిపిఎం గంపలగూడెం మండల నాయకులు చెరుకు వీరారెడ్డి, జానపాటి వెంకటేశ్వరరావు, గుంటుపల్లి వీరభద్రం, వడ్డెరపు మాధవరావు, బండి వీరబాబు, మీసాల గోపాలకష్ణ, ఎం.కుటుంబరావు, బి.శివరామకష్ణ, ఎస్‌జె.చారి, ఎ.కొండూరు మండల నాయకులు పి.ఆనందరావు, ఎస్‌.రామకష్ణారెడ్డి, నాయకులు బి.గోపిరాజు, విస్సన్నపేట మండల నాయకులు పులిబల్ల ఏడుకొండలు, గద్దల రామకష్ణ, సిఐటియు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, కార్యకర్త ఎం.చింతయ్య తదితరులు ఉన్నారు. ఎ.కొండూరు స్టేషన్లో ఉన్న నేతలను సిపిఎం నాయకులు చిన్న దుర్గారావు, బి.బిచ్చ, ఎ.అమ్మిరెడ్డి పరామర్శించారు.
తిరువూరులో అరెస్టయిన నేతలను పరామర్శిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, జిల్లా నాయకురాలు ఎన్‌సిహెచ్‌.సుప్రజ