May 24,2022 06:45
  • ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడి

దావోస్‌ : కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యంతో ప్రపంచ దేశాలు ఒకవైపు అతలాకుతలమవుతుంటే మరోపక్క ఆ పరిస్థితులనే ఉపయోగించుకుని ప్రతి 30 గంటలకు ఒక కొత్త శత కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని 'ఆక్స్‌ఫామ్‌' వెల్లడించింది. ఫార్మా, ఆహార, ఇంధన, సాంకేతిక పరిశ్రమ రంగాలకు చెందిన దిగ్గజాలు ''రిగ్గింగ్‌'' ఆర్థిక వ్యవస్థ నుంచి పెద్దయెత్తున లాభాలు నొల్లుకున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న నేపథ్యంలో పున:పంపిణీ సక్రమంగా జరగకపోతే 26.3 కోట్ల మంది ప్రజలు ఈ ఏడాది దుర్భర దారిద్య్రంలోకి నెట్టబడతారని ఆక్స్‌ఫామ్‌ హెచ్చరించింది. స్విస్‌ రిసార్ట్‌ నగరమైన దావోస్‌లో నయా సంపన్నుల సమావేశానికి ఈ మేరకు సందేశాన్ని పంపింది. ''బాధ నుండి లాభార్జన'' పేరుతో ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను సోమవారం వెలువరించింది. కోవిడ్‌ మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్‌) సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతుండడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను వెలువడింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు దోపిడీ దారులకువరం, పేదలకు శాపంగాను ఎలా పరిణమించాయో ఆక్స్‌ఫామ్‌ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంటుంది. తమ ఆర్థిక వ్యవస్థలను దోచుకునే కోటీశ్వరుల వర్గానికి నకలుగా వుండాలనుకుంటున్నారా? లేక మానవాళి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలనుకుంటున్నారా? తేల్చుకోవాలంటూ దావోస్‌లో ఈ వారంలో సమావేశమవుతును సంపన్నులను ఆ నివేదిక కోరింది. ''ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాల నుండి అత్యంత శక్తివంతమైన సంపన్నులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదు.'' అని ఆక్స్‌ఫామ్‌ ఇంటరుేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియెలా బుచర్‌ హెచ్చరించారు. భయంకరమైన ఈ అసమానతలు ఇనాుళ్లుగా మానవాళినంతటిని కలిపివుంచిన బంధాలను చీలుస్తున్నాయి. ఇది విచ్ఛిన్నకరం, ప్రమాదకరం'' అని వ్యాఖ్యానించారు.
     ఆక్స్‌ఫామ్‌ గణాంకాల ప్రకారం, కోవిడ్‌ సమయంలో కొత్తగా 573మంది శత కోటీశ్వరులు పుట్టుకొచ్చారు. గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనిరీతిలో కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన మొదటి 24మాసాల్లో వీరి మొత్తం ఆస్తులు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ కుబేరుల మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత అంతర్జాతీయ జిడిపిలో 13.9శాతానికి సమానంగా వుంది. 2000 సంవత్సరంలో కన్నా 4.4శాతం పెరిగిందని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. ఈ సంపదను సృష్టించడంలో ఔషధ, ఆహార, ఇంధన, సాంకేతిక రంగాలు ముందంజలో వున్నాయని పేర్కొంది. మోడరాు, ఫైజర్‌ వంటి 40కొత్త ఔషధ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి కోవిడ్‌ వ్యాక్సిన్లతో వ్యాపారం చేసుకునిఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించాయని నివేదిక తెలిపింది. ప్రజల పెట్టుబడులతో వారి ఉత్పత్తులను అభివృద్ది పరచుకున్నారని వ్యాఖ్యానించింది. కేవలం వ్యాక్సిన్ల కారణంగానే ఈ సంస్థలు లాభాల బాట పట్టాయని పేర్కొంది. గత రెండేళ్లలో ఆహార, అగ్రి బిజినెస్‌ రంగాల్లోని శత కోటీశ్వరులు తమ సంపదను 45శాతం మేర పెంచుకున్నారు.