కృష్ణా జిల్లా రెజ్లింగ్ సెలెక్షన్స్‌కు అధిక స్పందన ట్రయల్స్‌కు 250 మంది రెజ్లర్లు హాజరు
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) పూర్వ కష్ణాజిల్లా రెజ్లింగ్ అండర్-14, 17 కేటగిరీల బాలబాలికల జట్ల ఎంపిక ట్రయల్స్ బుధవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చరిత్రలో మొదటిసారిగా, జిల్లా ఎంపిక ట్రయల్స్‌కు 250, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని ఓల్డ్ స్టూడెంట్స్ హాల్లో ఎస్‌జీఎఫ్‌ఐ కష్ణా జిల్లా కార్యదర్శి తోట అజరు, నున్న జెడ్‌పిహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డి ఎంపిక ట్రయల్స్‌ను ప్రారంభించారు. జిల్లా జట్లను ఎంపిక చేసేందుకు 125 మ్యాచ్‌లు నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) పల్నాడు జిల్లా రెజ్లింగ్ కోచ్ కె.మనోహర్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. మ్యాచ్‌లు ముగిసిన అనంతరం కష్ణా జిల్లా రెజ్లింగ్ అండర్-14, 17 ఏళ్ల బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎస్‌జిఎఫ్‌ఐ కష్ణా జిల్లా కార్యదర్శి తోట అజరు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో అండర్-14, 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించను న్నామని, ఎస్‌జిఎఫ్‌ఐ రాష్ట్ర ఛాంపియన్ షిప్‌లు జరుగుతాయని రెజ్లింగ్ టోర్నీతో రాష్ట్రంలో ప్రారంభమవు తాయన్నారు. ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డి మాట్లాడారు. ఎస్‌జిఎఫ్‌ఐ రాష్ట్ర ఛాంపియన్‌షిప్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్లు టి.విజయవర్మ, టి.శ్రీలత, హైస్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ సూరపనేని రవిప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఫిజికల్ డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.










