Apr 10,2023 20:54

కోవిడ్‌పై మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్న వైద్యులు

కలికిరి : కోవిడ్‌పై వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిపిఎంఒ డాక్టర్‌ లోకవర్ధన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ మాక్‌ డ్రిల్ల్‌ నిర్వహించారు. గడచిన వారం రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుచున్న దరిమిళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఎపివివిపి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కోవిడ్‌ కేసులు నమోదైతే ఎలా స్పందించాలి, ముందస్తు ప్రణాళికలు, డాక్టర్‌లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, నాల్గవ తరగతి సిబ్బంది మొదలైన సిబ్బంది సరిపడా చెక్‌ లిస్ట్‌ ప్రకారం ఉన్నారా, బెడ్స్‌ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ కాంసెంట్రాటర్స్‌ అందుబాటులో ఉన్నాయా, ఉంటే పని చేస్తున్నాయా, ఆక్సీజన్‌ సిలెండర్స్‌ స్టాక్‌ ఉన్నాయా, పిపిఇ కిట్స్‌, ఎన్‌-95 మాస్క్‌లు, గ్లోవ్స్‌, ర్యాపిడ్‌ కిట్స్‌, ఆర్‌టిపిసిఆర్‌ కిట్స్‌, అత్యవసర మందులు, అంబులెన్స్‌లు, మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, ఇన్వెర్టర్స్‌ కండిషన్స్‌ మొదలైన వివరాలు ప్రోటోకాల్‌ ప్రకారం తనిఖీ చేసి నివేదిక ప్రభుత్వానికి పంపామని డాక్టర్‌ లోకవర్ధన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, సిహెచ్‌సి వైద్యులు సిమ్రాన్‌, మహేజాబిన్‌ తాజ్‌, హెడ్‌ నర్స్‌, రేడియో గ్రాపెర్‌ రమణ పాల్గొన్నారు.