ప్రజాశక్తి - రెడ్డిగూడెం : జగన్ అరాచక పాలన అంతం కావాలని మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఓటు అనే ఆయుధంతో తమ సత్తా చూపి జగన్ను సాగనంపుతామంటూ నినాదాలు చేశారు. బాబు వెన్నంటి తామున్నామని టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల టిడిపి నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు
తిరువూరు : చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసనగా టిడిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నియోజవర్గ తిరువూరు కార్యాలయంలో గురువారం మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శావల దేవదత్తు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ప్రారంభించారు.
విజయవాడ అర్బన్ : ప్రజాస్వామ్యం అంటే వైసిపి ప్రభుత్వానికి ఆ పార్టీ నాయకులకు లెక్కలేదని కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయం ఆవరణలో నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం రిలే నిరాహార దీక్ష జరిగింది. దీక్ష ప్రారంభానికి ముందు నాయకులు కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా గద్దె అనూరాధ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
వన్‌టౌన్ : టిడిపి పశ్చిమ నాయకులు ఎంఎస్. బేగ్ సారధ్యంలో పశ్చిమ మైనారిటీ అధ్యక్షులు హబీబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో రిలే నిరాహారదీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బేగ్ మాట్లాడారు. దీక్ష బయట ఏర్పాటు చేయబడిన నేను సైతం బాబు కోసం అనే సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసారు. జగ్గయ్యపేట: నారా చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు, అరెస్టులను నిరసిస్తూ పట్టణంలో గత 14 రోజులుగా జరుగుతున్న దీక్ష శిబిరంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు అధ్యక్షతన రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి కోటారు సత్యనారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో గండ్రాయి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శిబిరంలో కూర్చున్నారు. వీరికి విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం, శ్రీరామ్ సాయి ప్రసాద్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకష్ణారెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.










