Jan 04,2022 22:29

gannavaram lo

కొలువుతీరిన వైస్‌ఎంపిపి-2లు
ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లావ్యాప్తంగా మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు(వైస్‌ఎంపిపి)-2ల ఎంపిక జరిగింది. అన్ని మండలాల్లో రెండో వైస్‌ ఎంపిపిలను ఎంపిటిసిలు ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.
గన్నవరం : గన్నవరం మండల వైస్‌ ఎంపిపి-2గా కేసరపల్లి ఎంపిటిసి సాతులూరు శివగనాగరాజకుమారి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి సురేష్‌ బాబు, ఎంపిడిఓ వైసుభాషిణి ఆమె ఎన్నికను పూర్తి చేసి అధికారిక పత్రం అందించారు. ఎంపిపి అనగాని రవి, జడ్పిటిసి ఎలిజబెత్‌ రాణి, వైస్‌ ఎంపీపీ-1 కొమ్మరాజు సుధీర్‌ ఆమెకు అభినందనలు తెలిపారు. ఉంగుటూరు మండల పరిషత్‌ కార్యాలయంలో వైస్‌ ఎంపిపి-2 గా కొట్నాని చంద్రశేకర్‌ ఎన్నికయ్యారు. అతని చేత ఎన్నికల అధికారులు ప్రమాణస్వీకారం చేయించి, అధికారపత్రం అందచేశారు.మండల ఎన్నికల అధికారి నాగరాజు, ఎంపిడిఓ జ్యోతిచ ఎంపిపిపులపాకప్రసనలక్ష్మి, వైస్‌ ఎంపిపి వీరంకి కుసుమ, వైస్సార్‌సిపి మండలాధ్యక్షులు వింతా శంకర్‌ రెడ్డి, వైస్సార్‌ సిపి కన్వీనర్‌ గుడిసె బాలస్వామి, వెల్దిపాడుగ్రామ వైస్సార్‌ సీపీ కన్వీనర్‌ బొకినాల కిరణ్‌కుమార్‌, నాగవరప్పాడు సర్పంచ్‌ పెదనాగూరు పాల్గొన్నారు. పెడన :పెడన, కత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల రెండో వైస్‌ ఎంపీపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. కత్తివెన్ను మండల పరిషత్‌ కార్యాలయంలో 2వ వైస్‌ ఎంపీపీగా కుమారి గూట్ల నిరీష, బంటుమిల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో 2 వ వైస్‌ ఎంపీపీ గా కొల్లా లలిత, పెడన మండల పరిషత్‌ కార్యాలయంలో 2 వ వైస్‌ ఎంపీపీ గా పరసా వాకాలమ్మ కాకర్లమూడి సెగ్మెంట్‌ ఎంపీటీసీకి నియామక పత్రాన్ని అందజేశారు. గూడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో 2 వ వైస్‌ ఎంపీపీగా పిచ్చుక గంగాధరరావు, పోలవరం సెగ్మెంట్‌ ఎంపీటీసీకి నియామకపత్రాన్ని అందజేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కోడూరు : కోడూరు మండల ప్రజా పరిషత్‌ రెండో ఉపాధ్యక్షుని ఎన్నిక మంగళవారం ఎన్నికల ప్రత్యేక అధికారి మచిలీపట్నం డీఎల్పీవో జ్యోతిర్మయి అధ్యక్షతన కోడూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ ఎన్నికలో కోడూరు మండలం కొత్తపాలెం ఎంపీటీసీ ముక్కు వెంకటేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని ముక్కు వెంకటేశ్వరరావు అందించారు.ఈ సందర్భంగా ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి మహిళా ఎంపీటీసీ లు ఎన్నికల అధికారి జ్యోతిర్మయి ని దుశ్శాలువతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యాదవ రెడ్డి వెంకట సత్యనారాయణ, ఎంపీడీవో సుధా ప్రవీణ్‌, ఈవోపీఆర్డీ నాగ రేవతి, మండలంలోని 13 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఉయ్యూరు : ఉయ్యూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఉయ్యూరు మండలం మండల పరిషత్‌ రెండో ఉప అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గంజి వెంకట స్వర్ణకుమారి మండల రెండో ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది .ఎన్నికల నియమావళి ప్రకారం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ కె శ్రీనివాస్‌ ధ్రువ పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు చీలి కల్పన, మండల అభివద్ధి అధికారి సునీతా శర్మ పలువురు పాల్గొన్నారు. ముదినేపల్లి : ముదినేపల్లి మండల రెండో వైస్‌ ఎంపిపిగా మండలంలోని గురజ ఎంపిటిసి రాచూరి రాధా కాశీ లక్ష్మీ సుకన్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోె ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ పెద్దలు, సిఎం జగన్‌ అదేశాలు మేరకు బిసి రజక సామాజిక వర్గానికి చెంది మహిళ రాధాను ఎంపిక చేశామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జడ్పీటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, వైస్‌ఎంపిపి సునీత, .గంటా సంద్య తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ : అవనిగడ్డ మండల పరిషత్‌ కు రెండవ ఉపాధ్యక్షుడిగా అవనిగడ్డ-1 ఎంపిటిసి ది డ్ల వెంకటేశ్వరరావు( కిరణ్‌) ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో స్పెషల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎస్‌ సంజీవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతి వెంకటేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదించారు. నాల్గో సెగ్మెంట్‌ ఎం పి టి సి తోట గణేష్‌ బలపర్చారు. వెంకటేశ్వరరావు చేత సంజీవరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వెంకటేశ్వరరావును ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి ఎం లక్ష్మి కుమారి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు, మాజీ ఎంపీపీ ది డ్ల ప్రసాద్‌ పాల్గొన్నారు